Nadipinchu Na Naava telugu christian song lyrics :
నడిపించు నా నావ - నడిసంద్రమున దేవా
నవజీవన మార్గమున - నా జన్మతరియింప
నా జీవిత తీరమున - నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
నా ఆత్మవిరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము " నడి "
రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నాపడవ " నడి "
ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అలసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయె - ఆవేదనెదురాయె
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా కలలు " నడి "
ప్రభుమార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
ప్రపంచనటనలలో - ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై ఇపుడు - పాటింతు నీ మాట " నడి "
లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో - లోటైన నా బ్రతుకున్
లోపించని అర్పణగా - లోకేశ చేయుమయా " నడి "
ప్రభు యేసుని శిషుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభుకొరకు - ప్రాణార్పణ జేతు " నడి "
Nadipinchu Na Naava telugu christian song lyrics in English :
naDipiMchu naa naava - naDisaMdramuna daevaa
navajeevana maargamuna - naa janmatariyiMpa
naa jeevita teeramuna - naa apajaya bhaaramuna
naligina naa hRdayamunu - naDipiMchumu lOtunaku
naa aatmavirabooya - naa deeksha phaliyiMpa
naa naavalO kaaliDumu - naa saeva jaekonumu " naDi "
raatraMtayu SramapaDinaa - raalaedu prabhoo jayamu
rahadaarulu vedakinanu - raadaayenu pratiphalamu
rakshiMchu nee siluva - ramaNeeya lOtulalO
ratanaalanu vedakuTalO - raajillu naapaDava " naDi "
aatmaarpaNa chaeyakayae - aaSiMchiti nee chelimi
ahamunu praemiMchuchunae - alasiti prabhu nee kalimi
aaSa niraaSaaye - aavaedaneduraaye
aadhyaatmika laemigani - allaaDe naa kalalu " naDi "
prabhumaargamu viDachitini - praarthiMchuTa maanitini
prabhu vaakyamu vadalitini - paramaarthamu marachitini
prapaMchanaTanalalO - praaveeNyamunu boMdi
phalaheenuDanai ipuDu - paaTiMtu nee maaTa " naDi "
lOtaina jalamulalO - lOtuna vinabaDu svaramaa
lObaDuTanu naerpiMchi - lOpaMbulu savariMchi
lOnunna eevulalO - lOTaina naa bratukun^
lOpiMchani arpaNagaa - lOkaeSa chaeyumayaa " naDi "
prabhu yaesuni SishuDanai - prabhu praemalO paadukoni
prakaTiMtunu lOkamulO - pariSuddhuni praema katha
paramaatma prOkshaNatO - paripoorNa samarpaNatO
praaNaMbunu prabhukoraku - praaNaarpaNa jaetu " naDi "
3 Comments
There are so many mistakes
ReplyDeleteThen correct them
ReplyDeletePraise the LORD
ReplyDelete