krotha yedu modalu pettenu telugu song lyrics :
క్రొత్తయేడు మొదలు బెట్టెను - మన బ్రతుకువందు- క్రొత్త
మనసు తోడ మీరు - క్రొత్తయేట బ్రభుని సేవ దత్తర
పడ కుండ జేయు - టుత్తమోత్తమంబు జూడ " క్రొత్త "
పొందియున్న మేలు లన్నియు - బొంకంబు మీఱ- డెంద
మందు స్మరణ జేయుడీ -యిందు మీరు మొదలు బెట్టు -
పందెమందు గెల్వవలయు -నందముగను రవిని బోలి-
వలయకుండ మెలయకుండ " క్రొత్త "
మేలు సేయదడ వొనర్పగా మీ రెఱుగునట్లు- కాలనంత
నిరుడు గడచెగా -ప్రాలుమాలి యుండకుండ - జాల
మేలు సేయవలయు- జాల జనముల కిమ్మను - యేలు నామ
ఘనత కొఱకు " క్రొత్త "
బలము లేని వార మయ్యును - బల మొంద వచ్చు గలిమి
మీఱ గర్త వాక్కున - వలయకుండ నడుగుచుండ - నలగ
కుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల - నెలమి
మీ రొనర్చుచుండ " క్రొత్త "
ఇద్ధరిత్రి నుండు నప్పుడే - యీశ్వరుని జనులు - వృద్ధిబొంద
జూడవలయుని - బుద్ధి నీతి శుద్ధులంది-వృద్ధినొంద శ్రద్ధ
జేయ-శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగు వచ్చు " క్రొత్త "
పాపపంక మంటినప్పుడు - ప్రభు క్రీస్తు యేసు - ప్రాపు
జేరి మీరు వేడగా - నేపుమీఱ దనదు కరుఱ - బాప
మంత గడిగి వేసి -పాపరోగ చిహ్న లన్ని - బాపి వేసి
శుద్ధిజేయు " క్రొత్త "
krotha yedu modalu pettenu telugu song lyrics In English :
krottayaeDu modalu beTTenu - mana bratukuvaMdu- krotta
manasu tODa meeru - krottayaeTa brabhuni saeva dattara
paDa kuMDa jaeyu - TuttamOttamaMbu jooDa " krotta "
poMdiyunna maelu lanniyu - boMkaMbu mee~ra- DeMda
maMdu smaraNa jaeyuDee -yiMdu meeru modalu beTTu -
paMdemaMdu gelvavalayu -naMdamuganu ravini bOli-
valayakuMDa melayakuMDa " krotta "
maelu saeyadaDa vonarpagaa mee re~rugunaTlu- kaalanaMta
niruDu gaDachegaa -praalumaali yuMDakuMDa - jaala
maelu saeyavalayu- jaala janamula kimmanu - yaelu naama
ghanata ko~raku " krotta "
balamu laeni vaara mayyunu - bala moMda vachchu galimi
mee~ra garta vaakkuna - valayakuMDa naDuguchuMDa - nalaga
kuMDa mOda moMdi bala mosaMgu sarvavidhula - nelami
mee ronarchuchuMDa " krotta "
iddharitri nuMDu nappuDae - yeeSvaruni janulu - vRddhiboMda
jooDavalayuni - buddhi neeti SuddhulaMdi-vRddhinoMda Sraddha
jaeya-Suddhulaina vaarilO prasiddhulaguchu velugu vachchu " krotta "
paapapaMka maMTinappuDu - prabhu kreestu yaesu - praapu
jaeri meeru vaeDagaa - naepumee~ra danadu karu~ra - baapa
maMta gaDigi vaesi -paaparOga chihna lanni - baapi vaesi
Suddhijaeyu " krotta "
Credits:
Bekind - Telugu Christian Songs
0 Comments