5 Parvathalu Tholagina with Lyrcis - Hosanna ministries Sadayuda 2019 song
పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన
నా కృప నిన్ను విడిచిపోదంటివే నా యెసయ్యా విడచిపోదంటివే
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా మంచి కాపరివయ్యా
సుడిగాలి వీచిన సంద్రమే పొంగిన
అలలే అలజడిరేపిన నను కదలనియ్యక
సత్యమునందు నన్ను ప్రతిష్ఠించి
సీయోను కొండ ఓలె నన్ను మార్చితివి "పర్వతములు"
ధరణి దద్ధరిల్లిన గగనం గతి తప్పిన
తారలన్ని రాలిపోయిన నను చలించనులే
స్థిరమైన పునాధి నీవై నిలకడగా నిలిపితివి
కుడి ప్రక్కన నీవుండగా నేనెన్నడు కదలనులే "పర్వతములు"
మరణమైన జీవమైన ఉన్నవైన రాబోవునవైన
సృష్ఠింపబడినదేదైనను నీ ప్రేమను ఆర్పలేవు
నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను బలపరచితివి
నిరంతరం నీతోకలసి సేయోనులో నిలిచెదను "పర్వతములు"
Parvathalu Tholagina with Lyrcis in English :
parvatamulu tolagina meTTalu daddarillina
naa kRpa ninnu viDichipOdaMTivae naa yesayyaa viDachipOdaMTivae
yaesayyaa naa yaesayyaa
neevae naa maMchi kaaparivayyaa
suDigaali veechina saMdramae poMgina
alalae alajaDiraepina nanu kadalaniyyaka
satyamunaMdu nannu pratishThiMchi
seeyOnu koMDa Ole nannu maarchitivi "parvatamulu"
dharaNi daddharillina gaganaM gati tappina
taaralanni raalipOyina nanu chaliMchanulae
sthiramaina punaadhi neevai nilakaDagaa nilipitivi
kuDi prakkana neevuMDagaa naenennaDu kadalanulae "parvatamulu"
maraNamaina jeevamaina unnavaina raabOvunavaina
sRshThiMpabaDinadaedainanu nee praemanu aarpalaevu
nee chittamu neravaerchuTaku nannu balaparachitivi
niraMtaraM neetOkalasi saeyOnulO nilichedanu "parvatamulu"
0 Comments